ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించిన భీమ్ భరత్
నేటిసాక్షి ప్రతినిధి,చేవెళ్ల (చిక్కిరి. శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని లబ్ధి దారులకు చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ పామేన భీమ్ భరత్ నియామక పత్రాలు ఇచ్చి ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన పేదలందరికీ సొంత ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లను కేటాయించింది. కాగా మొదటి విడతలో సొంత జాగా ఉన్నవారికే ఇండ్లను కేటాయిస్తోంది ప్రభుత్వం. వచ్చే విడత నుంచి ఇంటి స్థలం లేని వారికి ప్లాట్ మంజూరు చేసి రూ. 5 లక్షలతో ఇల్లు నిర్మించనుంది అని తెలియజేశారు మరియు ఎస్టీ,ఎస్టీ వర్గాలకు చెందిన అదనంగా రూ. లక్ష సాయం అందించనున్నట్లు తెలిపారు. అంటే బీసీ, మైనార్టీ వర్గాలకు ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు సాయంగా అందిస్తుంటే, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం రూ. 6 లక్షలు సాయం అందించనున్నట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల హమీల్లోనూ ఈ వాగ్ధానం చేసింది. ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్ ద్వారా ఇల్లు కట్టుకునేందుకు ఎస్టీ, ఎస్టీలకు రూ. 6 లక్షలు, ఇతరులకు రూ. 5 లక్షలు సాయంగా అందిస్తామన్నారు ఇప్పుడు అందుకు అనుగుణంగానే హామీని అమలు చేస్తోంది అని కొనియాడారు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను మహిళల పేరు మీదే అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళలు సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగున్నట్లే అని పేర్కొంది. అందుకే ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను మహిళ పేరు మీద మంజూరు చేయనున్నట్లు తెలిపారు…ఈ కార్యక్రమంలో పాటుగా పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ మొయినాబాద్ మండలం అధ్యక్షులు మానయ్య, వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త జైపాల్ రెడ్డి కుమ్మరి వెంకటేష్ మాజీ సర్పంచులు సత్యనారాయణ వీరభద్ర స్వామిమాడి వెంకట్ రెడ్డి . కరణ్ కుమార్ ఎంపీటీసీలు కేబుల్ రాజు ఇందిరమ్మ కమిటీ మెంబర్స్మాణిక్ రెడ్డి విజేందర్గణేష్ కెయాదయ్య సర్దార్ నగర్ మార్గం కమిటీ మెంబర్ బాలకృష్ణారెడ్డి జైపాల్ రెడ్డి విలేజ్ కమిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి శ్రీపాల్ రెడ్డి నర్సింగ్ రావు నియోజిన్. ఈరన్నపేట్ నాగరాజు బిక్షపతి శ్రీనివాస్ రెడ్డి అశోక్ నాగిరెడ్డి గూడా గ్రామ కమిటీ అధ్యక్షులు విజయరాజ్. కనగల రాజుయూత్ కాంగ్రెస్ నరేందర్ గౌడ్మాడు జయపాల్ రెడ్డి హరేందర్చందానగర్ ఎంపీటీసీ గణేష్ గౌడ్ ,
ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

