Monday, March 9, 2026

ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో పేదలకు అన్యాయం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నేటి సాక్షి కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి మే 24 కాగజ్ నగర్ పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. కాగజ్‌నగర్ పట్టణంలోని గుంటూరు కాలనీలో పేదల ఇళ్లను సందర్శించిన ఆయన, నిరుపేదలకు ఇళ్లు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్రమంగా మంజూరు చేశారని విమర్శించారు. గుంటూరు కాలనీలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, కనీస మౌలిక సౌకర్యాలు లేకపోవడం, వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడం వంటి సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవకతవకలపై బాధ్యులను ఉపేక్షించబోమని, పేదలకు న్యాయం జరిగేలా పోరాడుతామని డాక్టర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించి, నిజమైన లబ్ధిదారులకు ఇళ్లు అందేలా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News