నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………………………………. శుక్రవారం రోజున జిల్లా కలెక్టరేట్ ఆడిటరియంలో జిల్లాలోని నియోజకవర్గం ప్రత్యేక అధికారులు,మండల స్పెషల్ అధికారులు,ఎంపీడీవోలు,మున్సిపల్ అధికారులు, ఏఈ లు, డి ఈ లు మరియు క్లస్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు.జిల్లాలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పెంచాలని అధికారులకు ఆదేశించిన జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్. *ఈ సందర్భంగాఅదనపు కలెక్టర్ మాట్లాడుతూ*జిల్లాలోని మంజూరైనా ఇందిరమ్మ ఇండ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేయాలని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం నిర్మించుకునే ప్రతి ఇంటికి 100% సబ్సిడీ క్రింద ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అందజేస్తుందని అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల కొరకై ఉచితంగా ఇసుక లభిస్తుందని జగిత్యాల ప్రాంతంలో కొత్తగా ఇసుక బజార్ ఏర్పాటు చేయడం జరిగిందని లబ్ధిదారులకు తెలియజేయాలనీ కోరారు.ఇటుక,కంకర బేస్మెంట్ పై ధరల నియంత్రణ ఇండ్లు లబ్ధిదారులకు ధరలు అనుగుణంగా ఉండేలా అధికారులను కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు . ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వెనుకబడి ఉన్నట్లయితే వేగవంతం పెంచాలని అధికారులకు ఆదేశించిన జిల్లా అదనపు కలెక్టర్.ఇచ్చిన గడువులోపు వారికి కేటాయించిన టార్గెట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం పెంచే విధంగా లబ్ధిదారులను ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశించారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ భవనాలు ప్రభుత్వం నిర్దేశించిన పరిణామం కలిగి ఉండాలని లబ్ధిదారులకు ఇట్టి విషయాన్ని తెలియజేయాలని మరియు నిర్మాణాన్ని సకాలంలో నిర్మించుకునేందుకు కావాల్సిన మేస్త్రీ లు, కార్మికులను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునేందుకు ముందుకు రాని లబ్ధిదారుల స్థానంలో అర్హులైన కొత్తవారిని ఎంపిక చేయాలని ఆదేశాలు ఇచ్చారు.ఆర్థిక పరమైన సమస్యలుంటే సెర్ప్, మెప్మా ద్వారా రుణాలు మంజూరయ్యేలా చూడాలన్నారు.మార్కింగ్, బెస్మెంట్, స్లాబ్ లెవెల్ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు.దశలవారీగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపు నేరుగా ఆధార్ లింక్ చేయబడిన లబ్ధిదారుడి ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు.మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఎటువంటి అవంతరాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.





