*నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులకు ఆదేశించారు. గురువారం కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకుని అధికారులతో సమీక్షించారు.*గ్రౌండింగ్ పూర్తి చేయాలి – కలెక్టర్ స్పష్టం*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మంజూరైన అన్ని ఇందిరమ్మ ఇండ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఇండ్ల నిర్మాణం జరగాలని లబ్ధిదారులకు సూచించారు.*ధరల నియంత్రణపై కమిటీ ఏర్పాటు*ఇటుక, కంకర, బేస్మెంట్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు లబ్ధిదారులకు అనుకూలంగా ఉండేలా అధికారుల ద్వారా కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిర్మాణ పనులు ఎక్కడైనా వెనుకబడితే వెంటనే వేగం పెంచాలని తెలిపారు. గడువులోపు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.*రుణ సదుపాయాలు – నేరుగా బిల్లుల జమ*లబ్ధిదారులకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఐకేపి సహకార సంఘాల ద్వారా రుణాలు పొందాలని సూచించారు. దశలవారీగా బిల్లుల చెల్లింపులు ఆధార్ లింక్ చేసిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతాయని తెలిపారు. అనంతరం మార్కింగ్, బేస్మెంట్, స్లాబ్ స్థాయిలో ఉన్న ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి, త్వరగా నిర్మాణాలు పూర్తి చేసి గృహప్రవేశం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.____





