Saturday, March 14, 2026

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మట్టి దందా–వెంచర్ లకు మట్టి సరఫరా –మైనింగ్ అధికారుల తప్పుడు నివేదిక — కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్.

నేటి సాక్షి – లక్షేట్టిపేట(రేగుంట ప్రసాద్)అక్టోబర్ 23: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అంటూ తరలిస్తున్న మట్టిని వెంచర్ లకు సరఫరా చేసి దందా నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. గురువారం పట్టణంలోని ఐబీ లో మాట్లాడుతూ దండేపల్లి, లక్షేట్టిపేట మండలాల్లో మట్టిని అమ్ముకుంటున్న తీరుపై సంబంధిత మైనింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా మట్టి తరలింపులో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని, మేము ఆ అక్రమాల గురించి మైనింగ్ ఏ డీ ని వివరాలు కోరితే తప్పుడు సమాచారం ఇచ్చారని పలు పత్రాలను చూపించారు. అంతేకాకుండా మైనింగ్ అధికారులు ఇచ్చిన వివరాల కంటే ముందే కొన్ని ట్రాక్టర్లు, టిప్పర్లను పోలీసులు తాత్కాలికంగా సీజ్ చేసిన ఆధారాలు పేపర్లలో వచ్చాయాని వివరించారు. పేదలకు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం సరఫరా చేయాల్సిన మట్టి, ఇసుక వ్యవహారాల్లో అవినీతి జరుగుతుందన్నారు. ఇండ్లు నిర్మించుకునే పేదలకు ఇది భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల హాస్టల్ వార్డెన్ ఆత్మహత్య విషయంలో జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హాస్టల్స్ నిర్వహణ అధ్వానంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్లు తిప్పని లింగయ్య, శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ మాజీ చైర్మన్ నల్మాసు కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు పాదం శ్రీనివాస్, చుంచు చిన్నయ్య,లక్షేట్టిపేట, దండేపల్లి మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News