నేటి సాక్షి,నల్లబెల్లి,జూన్ 15: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి ఆదేశానుసారం. మండల పార్టీ అధ్యక్షులు చిట్యాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో. నల్లబెల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు బత్తిని మహేష్.ఆదివారం నాడు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందచేయడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షులు బత్తిని మహేష్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లుల ప్రక్రియ నిరంతరం కొనసాగే ప్రక్రియ అని కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైనవారందరికీ ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా మునీందర్. కొమరారెడ్డి. కుల లింగయ్య. కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

