పెగడపల్లి (కె గంగాధర్)నేటిసాక్షి
పెగడపల్లి మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టత్మక ప్రాజెక్ట్ లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు దీనితో పేదింటి ఇల్లు లేని వారు సంతోషం వ్యక్తం చేశారు కానీ ప్రారంభ దశలోనే వారికి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి అందులో భాగంగానే ఇల్లు కట్టుకోవడానికి ముఖ్యంగా ఇసుక అవసరం ఉంటుంది కానీ మండలం లో ఇసుక దొరకడం లేదు తప్పనిసరి పరిస్థితి లో లబ్ధిదారులు ప్రైవేట్ వ్యక్తులను చుట్టు పక్కల గ్రామంలలో దొరికే ఇసుక దళారులను తక్కువ ధరకు ఆశ్రయించగా వారు తీసుకువచ్చే క్రమంలో పోలీస్ అధికారులు మండల రెవిన్యూ అధికారులు ఆ యొక్క ట్రాక్టర్స్ ని సీజ్ చేస్తున్నారు దీనితో పేదవారికి ప్రారంభ దశలోనే ఆటంకలు ఎదురవుతున్నాయి దీనిని ప్రభుత్వం, తో పాటు అధికారులుగుర్తించి పర్మిషన్తో కూడిన లెటర్స్ ఒక్కో ఇంటికి ఎంత అవసరం ఉంటుందో ఆ మేరకు పర్మిషన్ ఇవ్వాలని. ప్రజలు కోరుకుంటున్నారు
బొమ్మేన ప్రమీల లబ్దిదారురాలు

