నేటిసాక్షి, మిర్యాలగూడ : నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళను శుక్రవారం ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తో కలిసిశాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనా రెండున్నర సంవత్సరాల లోనే నిరుపేదలకు సన్నబియ్యం, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి, ప్రజా ప్రభుత్వం గా ప్రజల ఆశీర్వాదాలు పొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్, సర్పంచ్ రాధ రామలింగయ్య యాదవ్, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





