చోటా నాయకులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి… బీదవారికి మొండిచేయేయి చూయిస్తారా….?అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ డిమాండ్…!!!నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :గత మూడు రోజులుగా అట్టహాసంగా జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ వ్యవహారం పరిశీలించిన ఐక్యవేదిక. శనివారం మున్సిపాలిటీ దగ్గరికి వెళ్లి అక్కడ వార్డ్ వైస్ గా ఉన్న లిస్టులను పరిశీలించి చూడగా లబ్ధిదారుల కంటే ఎక్కువగా. కొందరి మాజీ ప్రజా ప్రతినిధులు, అలాగే రాబోవు ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థులమని చెప్పుకుంటున్న వారూ వారి కుటుంబాల పేరు మీద వచ్చినట్టుగా తేలింది. కొందరి నాయకుల భార్యలకు, వారి తల్లి పేరు మీద, కొందరి కుమార్తెల పేరుమీద వచ్చినట్లుగా గుర్తించిన ఐక్యవేదిక .నిరుపేదలకు ఇవ్వకుండా తెల్ల బట్టలు వేసుకుని వనపర్తిని ఏలుతున్న కొందరు ప్రజా ప్రతినిధుల కుటుంబాలకు ఇల్లు కేటాయించడం ప్రతి ఒక్కరూ ఖండించదగ్గ విషయమే. ఒక మాజీ చైర్మెన్ వార్డులో కోటీశ్వరునికి ఇల్లు వచ్చిన విషయం చూస్తే అందరూ ముక్కున వేలు వేసుకుంటారు. ఎమ్మెల్యే పైరవీ దారులకు పైసలు ఇవ్వద్దని చెప్తున్నారు స్వాగతిస్తున్నాం. కానీ ఇక్కడ పైరవిదారులే ఇల్లు రాసుకున్నారు అని తెలుస్తుంది. అలాగే పలు వార్డుల్లో ఇంకా గుడిసెలో ఉన్న ఇల్లు లేని, లబ్ధి పొందని పేదవారు, కార్మిక కర్షకులు చాలామంది ఉన్నారు.వారికి ఈ ఇందిరమ్మ ఇల్లు కేటాయించండి, పట్టణంలో గ్రామాలలో ఇల్లు లేని నిరుపేద లబ్ధిదారులను గుర్తించి కలెక్టర్ వెంటనే స్పందించి వారికి తగు న్యాయం చేయగలరని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నది. ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో నిజమైన లబ్ధిదారులను గుర్తించి లేనివారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతున్నాము. నిజమైన లబ్ధిదారులకు కేటాయించండి. కొందరి నాయకులకు ఇండ్లు, భూములు, ఉండి కూడా వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినవి కనుక వారిని గుర్తించి ఆ లిస్టు నుండి తొలగించ వలసిందిగా డిమాండ్ చేస్తున్నాము. ఈ అవినీతికి ఆజ్యం పోసింది ఎవరో తెలుసుకొని వారిని కూడా శిక్షించాలని కలెక్టర్ ని కోరుతున్నాం. లేనియెడల త్వరలో కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేయడానికి అన్ని పార్టీలను సమయత్తం చేస్తామని ఐక్యవేదిక హెచ్చరిస్తుంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ ఎంపిక లో ఉన్న వారికి ఓటు వేయాలా లేదా ప్రజలు నిర్ణయించుకోవాలి.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు వెంకటేశ్వర్లు, కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, కృష్ణయ్య, నాగరాజు, రామస్వామి, కురుమూర్తి, రాఘవేందర్, రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు…

