నేటిసాక్షి, మిర్యాలగూడ : మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను, మరియు గ్రామ పంచాయతీ కార్యాలయంను బుధవారం శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పరిశీలించారు. అనంతరం రుద్రారం గ్రామంలో నూతన నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





