ఒకేరోజు 1913 ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ…!!!ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం…!!!గత పదివేల పాలనలో దగాపడ్డ నిరుపేదలు…!!!ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి…!!!నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణలోని నిరుపేద కుటుంబాలకు నేడు సొంత ఇంటి కల నెరవేరిందని ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి వారికి వెన్నుదన్నుగా ప్రభుత్వం నిలుస్తుందని వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.బుధవారం వనపర్తి నియోజకవర్గ పరిధిలోని అడ్డాకుల మండలంలోని కన్మనూర్, బలీద్ పల్లి, చిన్న మునగాల్చేడ్, పెద్ద మునగాల్చేడ్, గ్రామాలతో పాటు పెద్దమందడి మండల పరిధిలోని వెల్టూర్, చిలక టోన్ పల్లి గ్రామ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు, వనపర్తి మునిసిపాలిటీ, వనపర్తి మండలం, గోపాల్పేట మండలం, రేవల్లి మండలం, ఏదుల మండలంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయా మండలాలలో ఏర్పాటుచేసిన సమావేశాల్లో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఇల్లు లేని నిరుపేదలు దగాపడ్డారని డబల్ బెడ్రూంలు కట్టిస్తామని నీటిమీద రాతలాంటి మాయ మాటలు చెప్పి మోసపుచ్చారని ఎమ్మెల్యే విమర్శించారు.పదేళ్ల పాలనలో సంవత్సరానికి గ్రామానికి ఒక 5 ఇల్లు ఇచ్చుకుంటూ పోయిన నేటికీ గ్రామాలలో ఇంత మంది ఇల్లు లేని లబ్ధిదారులు ఉండేవారు కాదని ఆయన పేర్కొన్నారు.వనపర్తి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని ఇందుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 173 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.బుధవారం ఒకేరోజు 1913 ఇండ్లకు గాను దాదాపు 96 కోట్ల 65 లక్షల రూపాయలు పిలువగల ఇందిరమ్మ ప్రొసీడింగ్స్ ను లబ్ధిదారులకు అందజేశామని ఎమ్మెల్యే చెప్పారు.అడ్డాకల్ మండలం నాలుగు గ్రామాలు, పెద్దమందడి,మండలం రెండు గ్రామాలకు,సంబంధించి 99 మంది,వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి 575 మంది,వనపర్తి మండలానికి సంబంధించి 453 మంది,గోపాల్పేట మండలానికి సంబంధించి 419 మందికి,రేవల్లి మండలానికి సంబంధించి 205 మందికి,ఏదుల మండలానికి సంబంధించి 162 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టినట్లు ఆయన తెలిపారు.ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్క నిరుపేదకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచామని,మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామని,200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని,రూ 500 కే గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేస్తున్నామని,రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశామని,సన్న వడ్లు పండించే రైతులకు బోనస్,రైతు భరోసా ఇస్తున్నామని,రేషన్ కార్డులు లేని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని,రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి శ్రీమంతులు తినే సన్నబియ్యం ని ప్రతి ఒక్కరికి అందజేస్తున్నామని, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని,అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన చేస్తుందని,మండలానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించి ఉన్నత విద్యను అందించేందుకు చర్యలు చేపట్టిందని.కస్తూర్బా బాలికల విద్యాలయం లాగే బాలురకు సైతం మూడు కోట్ల 50 లక్షలతో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాల ద్వారా నేడు గ్రామీణ స్థాయిలోని నిరుపేదలకు సైతం లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తదితరాలకు పనులు చేసి పెడతామని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా తనకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆ గ్రామాల ప్రజలకు సూచించారు.రానున్న సర్పంచ్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడే వ్యక్తులను గెలిపించాలని అప్పుడే అభివృద్ధి కుంటు పడకుండా జరుగుతుందని,ఇతరులకు ఓటు వేస్తే వారు అభివృద్ధికి ఆటంకాలుగా మారుతారని వాళ్లు గెలిచిన మూడేళ్ల వరకు నేనే ఎమ్మెల్యేగా, రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉంటారని వారు గెలవడం ద్వారా ఒరిగేదేమీ లేదని ఎమ్మెల్యే అన్నారు.గ్రామాలలోని ప్రతి ఒక్కరూ సర్పంచ్లను ఎంపీటీసీలను జడ్పీటీసీలను ఎంపీపీ లను కాంగ్రెస్ పార్టీ వారిని గెలిపించుకునేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.గోపాల్పేట, రేవల్లి, ఏదుల గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ముహూర్తం చేశారు.కార్యక్రమంలో ఆయా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఇందిరమ్మ లబ్ధిదారులు మహిళలు యువకులు, తదితరులు పాల్గొన్నారు..

