నేటి సాక్షి, కరీంనగర్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 10 వ తేదీ సోమవారం నుంచి యథావిధిగా కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్టు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇన్ని రోజులు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రతి సోమవారం యథావిధిగా కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

