Thursday, March 19, 2026

*ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే వేగేశన** బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థుల కు ₹6 లక్షల రూపాయలు 90 మంచాలు అందజేత * ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు

నేటి సాక్షి,బాపట్ల జిల్లా (బాపట్ల రూరల్)ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు ,ప్రజాసేవకుడు బాపట్ల నరేంద్ర వర్మ అని అనడం లో ఎటువంటి సందేహం లేదని అన్నారు.బాపట్ల మండలం వెదుళ్ళపల్లిలోని బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం, సుమారు ₹6 లక్షల రూపాయల విలువగల 90 మంచాలను ఆయన శనివారం లాంఛనంగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ కార్యక్రమంలో శనివారం నాడు ఆయన సొంత నిధులతో రాయల్ మెరైన్ హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 90 మంచాలు విద్యార్థులకు అందజేశాను. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. వెదుళ్ళపల్లి బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించడం మనందరి సామాజిక బాధ్యత అన్నారు. గతంలో ఈ పాఠశాలను సందర్శించినప్పుడు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించాను. వారికి మంచాలు సమకూరుస్తానని అప్పుడే మాట ఇచ్చాను. ఆ మాటను నిలబెట్టుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. మన ప్రభుత్వం విద్యారంగానికి, ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. నా నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా వసతుల లేమితో ఇబ్బంది పడకూడదు అనేది నా లక్ష్యం. ఈ మంచాల వల్ల విద్యార్థులు హాయిగా, సౌకర్యవంతంగా చదువుకోవడానికి అవకాశం లభిస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ పాఠశాల అవసరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, వారికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ డిఎస్ రజియా, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్.కె నిజాం, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అందించిన సహాయానికి బధిరుల పాఠశాల విద్యార్థులు, చేతిపై థాంక్యూ ఎమ్మెల్యే సార్ అని విద్యార్థులు ఎమ్మెల్యేకు విద్యార్థుల చేతి మీద రాసి చూపించారు. వారి సైగలతో తెలియపరిచారు.పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News