Saturday, March 14, 2026

ఇచ్చిన హామీలను అసెంబ్లీలో వెంటనే ప్రవేశపెట్టాలి…

నేటి సాక్షి మార్చ్ 14 (మంచిర్యాల్) శ్రీధర్ దమ్మ*ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే అసెంబ్లీలో ఆటోలకు బడ్జెట్ కేటాయించాలి బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి గారికి ఆటో జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కట్ట రామ్ కుమార్ డిమాండ్ నోటీసు* కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇవ్వడం తో పాటు 12 వేల రూపాయలు ఇంకా అనేకమైన హామీలు ఇవ్వడం జరిగిందని రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న గాని ఇంకా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయాలేదని తక్షణమే ఈ నెల 16 నుంచి జరుగు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆటోలకు బడ్జెట్ కేటాయించాలని బెల్లంపల్లి ప్రాంతంలో నీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే గారిని కలిసి డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో భీమిని మండల్ ఆటో జేఏసీ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్ గారు కన్నెపల్లి మండల్ ఆటో జేఏసీ అధ్యక్షులు అంజన్న గారు సీనియర్ ఆటో డ్రైవర్ బూర్ల యాదగిరి గారు రాంపూర్ స్వామి గారు వెంకటాపూర్ సీనియర్ ఆటో డ్రైవర్ ముఖ్య సలహాదారుడు తదితరులు ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News