Friday, March 13, 2026

*ఇది కాదా.? కులవివక్ష.!?*————————–* బ్రహ్మోత్సవ ఫ్లెక్సీలో ‘తక్కళ్లపల్లి గ్రామ సర్పంచ్‌’కు అవమానం..? * ఫోటో పెట్టి పేరు, హోదా ప్రస్తావించకపోవడంపై విమర్శలు* ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్‌ను కింద భాగంలో చూపించారంటూ ఆగ్రహం* సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫ్లెక్సీ——*

నేటి సాక్షి – కథలాపూర్*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం తక్కలపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బోర్డు వివాదానికి దారితీసింది.!గ్రామ సర్పంచ్ ఫోటోను ‘అగ్రవర్ణాల వారి కాళ్ల కింద’ భాగంలో ఉంచి, అతని పేరు,హోదా ప్రస్తావించకపోవడంపై గ్రామంలో చర్చానీయాంశమైంది. ఈ ఘటనను కొందరు అవమానకరంగా అభివర్ణిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.!*’తక్కళ్లపల్లి’లో ఫ్లెక్సీపై వివాదం.!*తక్కలపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వాహకులు భారీ ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే వాటిలో ఒక ఫ్లెక్సీలో గ్రామ సర్పంచ్ ఫోటోను మాత్రమే ‘కాళ్ల కింద’ భాగంలో ఉంచి, పేరు-హోదా ప్రస్తావించకపోవడం గ్రామస్తుల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ప్రజాప్రతినిధుల ఫోటోలతో పాటు వారి పేరు, పదవిని ప్రస్తావించడం ఆనవాయితీగా ఉండగా, ఇక్కడ అది లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.*’దళిత’ సర్పంచ్‌పై అవమానమన్న ఆరోపణలు*గ్రామ సర్పంచ్ ‘దళిత సామాజిక’ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే, కావాలనే ఇలా చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇతరుల పేర్లు, హోదాలు స్పష్టంగా ఉండగా సర్పంచ్ వివరాలు లేకపోవడం ఉద్దేశపూర్వకమేనని కొందరు గ్రామస్తులు అంటున్నారు. ప్రజాప్రతినిధిని పాదాల కింద ఉన్నట్టుగా కింద భాగంలో చూపించడం కొత్త రకమైన అవమానంగా భావిస్తున్నామని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.*సోషల్ మీడియాలో వైరల్*ఈ ఫ్లెక్సీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై గ్రామస్తులు, నెటిజన్లు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు నిర్వాహకుల నిర్లక్ష్యంగా చూస్తుండగా, మరికొందరు ఇది సామాజికంగా అవమానించే చర్యగా విమర్శిస్తున్నారు.*స్పష్టత ఇవ్వాలని డిమాండ్*ఈ ఘటనపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన నిర్వాహకులు వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడే విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.__________

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News