Wednesday, March 18, 2026

*ఇది ప్రజల తీర్పు– సమత ప్రకాష్* *ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం* *మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేఎల్ఆర్ , కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి* *

( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 14:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సమత ప్రకాష్ మాట్లాడుతూ….జూబ్లీహిల్స్ గెలుపుతో భారత రాష్ట్ర సమితి ఖేల్ ఖతం దుకాణం బంద్ అని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సమత ప్రకాష్, అన్నారు.జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు పట్ల ఆమె హర్షం ప్రకటించారు. నోరు పారేసుకున్న బిఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు ముందుగానే కాంగ్రెస్ పార్టీ వైపు శుభ పరిణామ సంకేతాలు పంపించారని అయినా ఇది అర్థం చేసుకోలేని ప్రతిపక్ష నాయకులు నూటికి ఎంత వస్తే అంత మాట్లాడాలని చివరికి అభివృద్ధి సంక్షేమమే గెలిచిందని రేవంత్ రెడ్డి వ్యూహం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కృషి కార్యకర్త పట్టుదల కలిసి జూబ్లీహిల్స్ విజయం సాధించిందని ఇది సమిష్టి విజయం అని ఈ విజయంలో పాలుపంచుకున్న ప్రతి కార్యకర్తకు ప్రభుత్వానికి అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News