Friday, March 20, 2026

ఇది విద్యా హక్కు కోసం, భవిష్యత్తు కోసం జరిపే “మహోన్నత ఉద్యమం”.-మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పగించడం ఎంతటి దుర్మార్గపు ఆలోచన..- టీడీపీ కి చెందిన వాళ్లే వైయస్ జగన్ బేష్ అంటూ కితాబు..- కోట్లాది మంది ప్రజల మాట వినకుండా, వారి భావాలను అర్థం చేసుకోకుండా పాలన చేయాలని భావించడం అవివేకం.. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి

– నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 10 ~అన్నమయ్య జిల్లా :-: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “ప్రజా ఉద్యమం – కోటి సంతాకల” సేకరణ కార్యక్రమాన్ని తంబళ్లపల్లి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులను, ప్రజలందరినీ చైతన్యపరిచి వారి నుండి పెద్ద ఎత్తున సంతకాలను సేకరించి అందరి వద్ద సేకరించిన ప్రతులను వాహనంలో ఉంచి జిల్లా కేంద్రమైన రాయచోటి కి పంపే ఏర్పాట్లను తంబళ్లపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం మదనపల్లిలోని వైసీపీ కార్యాలయం నుండి ఆ వాహనాన్ని జెండా ఊపి సాగనంపారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలో విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. కానీ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు చాలా బాధాకరం. అధికారంలో మేమే ఉన్నాం. ఏమి చేసినా సాగుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు. వీటినంతా ప్రజలు గమనిస్తున్నారు. దగ్గర్లో ప్రజల నుంచి చివాట్లు తినే రోజులు రాబోతాయి. చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం మంచిది కాదు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయత్నం. ప్రజల డబ్బుతో, ప్రజల అవసరాల కోసం నిర్మించిన మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పగించడం ఎంతటి దుర్మార్గపు ఆలోచన. ప్రజలే బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్లకా ఓట్లు వేసి గెలిపించిందని ప్రజలే మదన పడుతున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ తప్పుడు నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొనడం ఎంతో ఆశాజనకమైన విషయం. పార్టీలకతీతంగా అన్ని పార్టీల వాళ్ళు స్వచ్ఛందంగా సంతకాలు పెట్టడం హర్షించదగ్గ విషయం. ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. టీడీపీ కి చెందిన వాళ్లే వైయస్ జగన్ బేష్ అంటూ కితాభిస్తున్నారు. కోట్లాది మంది ప్రజల మాట వినకుండా, వారి భావాలను అర్థం చేసుకోకుండా పాలన చేయాలని ప్రయత్నించడం సిగ్గుమాలిన చర్య. ఈ సంతకాల శక్తితో అయినా చంద్రబాబు ఆలోచన మారాలి. ఈ పోరాటం రాజకీయ పోరాటం కాదు. ఇది విద్యా హక్కు కోసం, భవిష్యత్తు కోసం జరిపే “మహోన్నత ఉద్యమం”. కూటమి ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయాలను పునఃపరిశీలించాలి. ప్రజల ఆలోచనలకు గౌరవం ఇవ్వాలి. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయకుండా ప్రజల కోసం నిలబెట్టాలని పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి ఆముదాల మధుసూదన్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు బైసాని చంద్రశేఖర్ రెడ్డి, సురేంద్రనాథ్, కోటిరెడ్డి, జిల్లా రైతు విభాగ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు సాంబశివ, బూత్ కమిటీ అధ్యక్షుడు రెడ్డి హరి, సర్పంచులు బాబు రెడ్డి, శ్రీనివాసులు, తంబళ్లపల్లి పార్టీ మండల కన్వీనర్ రేపన చౌడేశ్వర, వైసీపీ శ్రేణులు జగన్నాథరెడ్డి, సిద్ధమల్లు, రామ్మూర్తి, నరేందర్ రెడ్డి, కిషోర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News