నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):చందుర్తి మండలంలోని మల్యాల గ్రామంలో సోమవారం ఇంటిగ్రేటెడ్ నెట్‌వర్క్ ఫర్ కమ్యూనిటీ ఎంపవర్‌మెంట్ (ఇన్ఫోసెమ్) సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఇన్ఫోసెమ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మహేష్ గారి నేతృత్వంలో నిర్వహించారు. ఆరోగ్య శిబిరంలో గ్రామానికి చెందిన 31 మందికి హెచ్‌ఐవీ రక్త పరీక్షలతో పాటు షుగర్, రక్తహీనత (హిమోగ్లోబిన్), రక్తపోటు వంటి ముఖ్యమైన వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. పరీక్షల అనంతరం ఆరోగ్య పరిరక్షణపై, వ్యాధుల నివారణపై పాల్గొన్న వారికి అవగాహన కల్పించారు.ఇన్ఫోసెమ్ సంస్థ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరిన్ని గ్రామాల్లో నిర్వహిస్తూ, ప్రజల ఆరోగ్య అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసెమ్ సంస్థకు చెందిన జి.ఎన్.ఎం కల్పన, ఓఆర్‌డబ్ల్యూ లక్ష్మణ్, ఆశ కార్యకర్త మంజులతో పాటు గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.





