నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…….,……………………………2010కి ముందు నియామకం నియామకమైన ఉపాధ్యాయులు టెట్ అర్హత లేనందున గత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2010 కు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు విద్య హక్కు చట్టంలోని సెక్షన్ 23 ను సవరిస్తూ టెట్ నుండి మినహాయింపుస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి విన్నవించవలసిందిగా పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిని పెల్లి ఆనంద్ రావు, యాల్ల అమర్నాథ్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,సెప్టెంబర్ 1 తేదీన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఐదు సంవత్సరాల పైబడి ఉన్న ఉపాధ్యాయులకు మరియు ఐదు సంవత్సరాల లోపల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతి పొందాలంటే తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ కావాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యా హక్కు చట్టం 2009 తేదీ 23-8-2010 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం 2010 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులందరూ టెట్ అర్హత కలిగి ఉన్నారు. 2010 కు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు ఈ మినహాయింపు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మంది ఉపాధ్యాయులు, దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందని వారు అన్నారు.





