Thursday, March 19, 2026

ఇబ్రహీంపట్నం గ్రామ సర్పంచ్ గా నాగరాణి ఉప సర్పంచ్ గా మునిస్వామి…

నేటి సాక్షి నారాయణపేట, డిసెంబర్ 14, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని ఇబ్రహీంపట్నంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాగరాణి రఘు గెల్పొందడం జరిగింది. ఇబ్రహీంపట్నం గ్రామ ఉపసర్పంచ్గా మునిస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇబ్రహీంపట్నం గ్రామంలో 8 వార్డులు ఉండగా 5 ఏకగ్రీవం ఎన్నికయ్యాయి. మిగతా మూడు వార్డులో ఆయా పార్టీల వాడు సభ్యులు అభ్యర్థులు గెలిచారు.. ఇబ్రహీంపట్నం గ్రామంలో మొత్తం ఓట్లు 480 ఓట్లు ఉండగా 440 ఓట్లు. ఇబ్రహీంపట్నం గ్రామ సర్పంచ్ అభ్యర్థి నాగరాణి 72 ఓట్లతో గెలుపొందడం జరిగింది. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ నాగరాణి ఉపసర్పంచ్ మునిస్వామి లకు వార్డు సభ్యులకు శాలువాలు పూలమాలతో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News