నర్కుడలో 85 మందికి ఇళ్లకు భూమిపూజ, ధృవీకరణ పత్రాల పంపిణీ – పేదల కళ్లలో ఆనందం: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
నేటి సాక్షి ప్రతినిధి,శంషాబాద్ (చిక్కిరి శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలో..పేదలకు సొంత ఇంటి కలను నిజం చేయాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. శంషాబాద్ మండలంలోని నర్కుడ గ్రామంలో 85 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనుల కోసం భూమిపూజ నిర్వహించడంతో పాటు, ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యుడు ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ”కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పేదల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అలాంటి కలను సాకారం చేసే ఘట్టానికి మనం వచ్చాం. రూ. 5 లక్షల సహాయంతో ఇల్లు నిర్మించుకునే అవకాశం ఇవ్వడం దేశంలోనే ఉదాహరణకరం. ఇది పేదల జీవితం మార్చే నిర్ణయం.” అని పేర్కొన్నారు.అలాగే, “ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగింది. నిజంగా అర్హులైన వారికి ఇళ్లు మంజూరయ్యాయి. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పథకం లబ్ధిదారులు సంతోషంతో స్పందిస్తూ తమ కలల ఇల్లు ప్రారంభమవుతోందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

