నేటి సాక్షి,గుంటూరు జిల్లా ప్రతినిధి ఇళ్ల పట్టాల పేరుతో ప్రజలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం అని,పేదల కోసం నిరంతరం కృషి చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 20వ డివిజన్, మేనకా గాంధీ నగర్ 7వ లైన్లో రూ.49.90 లక్షల ఖర్చుతో సీసీ డ్రైన్ మరియు ఆర్‌సిసి కల్వర్టుల నిర్మాణ పనులకు గురువారం ఎమ్మెల్యే గళ్లా మాధవి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ డివిజన్ మేనకాగాంధీ నగర్ 7వ లైన్లో రూ.50 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ డ్రైన్ మరియు ఆర్‌సిసి కల్వర్టుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయటం జరిగింది. మేనకా గాంధీ నగర్ 17వ డివిజన్లోనిదేనని కొంత గందరగోళం ఉన్నప్పటికీ, ఈస్ట్–వెస్ట్ షేరింగ్ కారణంగా ఈ డివిజన్ కూడా తమ పరిధిలోనే వస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల శానిటేషన్ సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ నిర్లక్ష్యానికి గురైందని స్థానికులు తమకు తెలియజేశారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.ప్రస్తుతం కాంట్రాక్టర్ వేగంగా పనులు పూర్తి చేసి అందజేస్తానని హామీ ఇచ్చారని, ఇంకా స్థానిక ప్రజలు వెల్లడించిన ఇతర అభివృద్ధి సమస్యలను కూడా త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి–సంక్షేమం పారదర్శకంగా, వేగవంతంగా కొనసాగుతాయని, అందుకు ప్రజలు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం స్థానిక ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ అనంతవరపాడు ప్రాంతంలోని ఇళ్ల పట్టాల మోసం విషయంలో తీవ్రమైన అన్యాయం జరిగినట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. మేనకా గాంధీ నగర్, 21వ డివిజన్‌తో పాటు దాదాపు 6000 మంది ప్రజలకు ఎన్నికల సమయంలో ఓట్లు కోసం గత ప్రభుత్వం తెలియని ప్రదేశాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి విమర్శించారు.చాలామంది చేతుల్లోకి కూడా రాని రిజిస్ట్రేషన్ పట్టాలు సచివాలయాల్లో పేర్లపై పడేలా ఉంచబడడంతో ప్రజలు తమకే ఇళ్ల స్థలాలు వచ్చాయని తెలియని పరిస్థితిని గత ప్రభుత్వం సృష్టించిందని విమర్శించారు. అనంతవరపాడు ప్రాంతం ముళ్లపొదలతో నిండిన అడవి ప్రాంతంలా ఉండగా, ఆ ప్రదేశాన్నే ప్రజలకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చిన అన్యాయాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈస్ట్–వెస్ట్ నియోజకవర్గాల్లో కలిపి 20 వేల మందికి పైగా ఇదే పరిస్థితి ఎదురైందని పేర్కొన్నారు.ప్రస్తుతం హౌసింగ్ శాఖ మంత్రి, అధికారులు రెండుసార్లు ప్రాంతాన్ని సందర్శించి సమీక్ష నిర్వహించారని, ఎవరికెవరికీ నిజంగా రావాలో, ఎవరికీ తెలియకుండానే ఇచ్చారో అన్నది పునఃపరిశీలిస్తున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. తెలియకుండానే పట్టాలు పొందినవారి రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, అర్హులైన వారికి మళ్లీ 100 గజాల స్థలాలు కేటాయించే విధానంపై ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.ప్రజలు తమ వివరాలను స్థానిక డివిజన్ అధ్యక్షుల వద్ద నమోదు చేయిస్తే, వారి సమస్యలను ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో షేక్ మహ్మద్ రఫీ, షేక్ రఫీ, సీహెచ్ సాంబశివరావు, షేక్ హామది,రబ్బానీ, ఆదంసా, టెంట్ హౌస్ బాబు, ఈ వీరయ్య, సిహెచ్ నాగరాజు, సయ్యద్ గౌస్, సయ్యద్ కరీమూన్,షేక్ నాగూరా, డి. వెంకట్రావు, ఎన్ కోటేశ్వరరావు, షేక్ అజీజ్, కుమారి, మల్లికార్జున రావు, బాజీ, షేక్ జికిరియా, షేక్ ఖాజా, తాజుద్దీన్, ఖాజా మొహిద్దిన్, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.





