నేటి సాక్షి 21 మార్చి పాములపాడు:-మండల కేంద్రమైన పాములపాడులో, ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండుగను పురస్కరించుకొని సేవా భారతి (వై ఆర్ డి ఎస్) అధ్యక్షుడు ఎస్.షర్ఫద్దీన్ అలీ, సమాజ సేవకుడు కలబండి.నాగరాజు, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, సోషల్ మీడియా ప్రతినిధులు డక్కా శ్రీకాంత్, గోవిందు, జి.సాయి కృష్ణ, కే.మోసే, ప్రజా సంఘాల నాయకులతో కలిసి కుంటలో పనులు చేస్తున్న ఉపాధి శ్రామికులకు స్వీట్లు పంపిణీ చేసి ఈద్ ముబారక్ తెలియజేశారు. ఈ సందర్భంగా సేవా భారతి (వై ఆర్ డి ఎస్) అధ్యక్షుడు- ఎస్.షర్ఫద్దీన్ అలి, సోషల్ వర్కర్ & ఉపాధి హామీ మేట్- కే.నాగరాజు, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కే.అంకన్న, సోషల్ మీడియా ప్రతినిధులు డక్కా.శ్రీకాంత్, గోవిందు, కె.మోషే, జి.సాయి కృష్ణ, తదితర ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ హామీ పవిత్ర రంజాన్ మాసంలో వికసించిన ఆధ్యాత్మికత, ప్రేమ, దయ,సామరస్యపు సుగంధాలు ప్రజల జీవితాలలో పరిమళించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ లు. ముస్లిం సోదరి, సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల సమ్మేళనమని పేర్కొన్నారు. నెలరోజులపాటు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించిన భక్తులకు ఇది ఆధ్యాత్మిక శుద్ధిని ప్రసాదించే పవిత్ర కాలమని, వారి త్యాగానికి, నియమానికి పరిపూర్ణ ఫలితాలు లభించే విశిష్టమైన సందర్భమని అన్నారు.. ఈ పవిత్ర మాసంలో ఉపవాసం ద్వారా ఆకలి, దప్పులను అనుభవించడం మాత్రమే కాకుండా, పేదల బాధలను అర్థం చేసుకుని, సహానుభూతితో ముందుకు రావడమే ఇస్లాం మతం యొక్క ముఖ్య సందేశమని ఆయన వివరించారు. మనసులోని దుష్టచింతనలను, దురాచారాలను తొలగించి, సత్ప్రవర్తనను అలవాటు చేసుకోవడానికి నమాజ్ మార్గదర్శకంగా నిలుస్తుందని ఈ మాసంలోనే పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించిందని, రోజా (ఉపవాసం) ఆచరణకు ఈ మాసానికి ఉన్న ప్రత్యేకత రంజాన్ పండుగకు మరింత గొప్పదనాన్ని తెచ్చిందని ఆయన అన్నారు. రంజాన్ ద్వారా సమాజంలో ఐక్యత, శాంతి, సోదరభావం పెంపొందాలని, ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షించారు. సర్వమత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని స్నేహభావంతో మరింత ముందుకు నడవాలని కోరుతూ ఈ పవిత్రమైన శుభ సందర్భంగా మరొక్కసారి ముస్లిం సోదరి, సోదరులకు హృదయపూర్వక ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, ఉపాధి హామీ శ్రామికులు, తదితరులు పాల్గొనడం జరిగింది.





