Tuesday, March 17, 2026

ఈద్గా వద్ద ముమ్మరంగా పారిశుద్ధ్య పనులుమున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్ పరిశీలన..

నేటి సాక్షి , కొమురం భీం ఆసిఫాబాద్:ఆసిఫాబాద్ పట్టణంలో ముస్లింల పవిత్ర పండుగ ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)ను పురస్కరించుకుని ఈద్గా మైదానం వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.ఈ పనులను మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ గజానంద్, కౌన్సిలర్ సాలం బీన్ అహ్మద్ కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఈద్గా పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సిబ్బందితో కలిసి తొలగింపజేశారు.రంజాన్ పండుగ నమాజ్‌కు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ తెలిపారు. ముఖ్యంగా మంచినీటి సదుపాయం, పరిసరాల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి సూచించారు.పండుగ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఈద్గా మైదానాన్ని సిద్ధం చేస్తామని మున్సిపల్ యంత్రాంగం పేర్కొంది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News