నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ (సందెల రాజు)వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని జిల్లా వేర్ హౌజ్ గోదాములలో భద్రపర్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంల) ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి తో కలసి శుక్రవారం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు లోని ఈవీఎం గోదాములను కలెక్టర్ పరిశీలించారు.ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాంలకు సంబంధించిన రికార్డులు, కట్టు దిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించిన వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో తహసీల్దార్ ఇక్బాల్, ఎన్నికల నాయబ్ తహసీల్దార్ రంజిత్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఐ ఎన్ సి నుండి రాజేష్, టిడిపి నుండి శ్యామ్ సుందర్, ఏ ఐ ఎం ఐ ఎం నుండి ఫైజోద్దీన్, బిజెపి హరి శంకర్, తదితరులు పాల్గొన్నారు.




