నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 30జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ ,కాగజనగర్ డిఎస్పీ వాహిదుద్దీన్ తో కలిసి ఈరోజు ఈస్ గాం, పెంచికల్ పేట్, దహెగాం పోలీస్ స్టేషన్‌లను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, స్టేషన్ హాజరు రిజిస్టర్, స్టేషన్ శుభ్రత తదితర విభాగాలను పరిశీలించారు.ఎస్.హెచ్.ఓ లతో, స్టేషన్ సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు సిబ్బందీ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో చట్టవ్యతిరేకచర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదిదారుడితో, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు.మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, లా అండ్ ఆర్డర్ విషయంలో రాత్రిపూట పర్యవేక్షణ, ప్యాట్రోలింగ్‌ను కచ్చితంగా కొనసాగించాలని సూచించారు. అసాంఘిక కార్యక్రమాలు, మత్తు పదార్థాల నివారణకు కృషి చేయాలని అన్నారు. ప్రజాభద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

