నెటి సాక్షి, బాపట్ల జిల్లా ప్రతినిధి ఈ క్రాప్ లో నమోదైన పంటను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పలు సూచనలు చేశారు.ఈ క్రాప్ లో నమోదైన పంటను బుధవారం, కంకటపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూపర్ చెక్ చేశారు. ఈ సందర్భంగా సర్వే నెంబర్ 2 లో ఈ క్రాప్ 5.9 వర్షన్, ఈ పంట యాప్ లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసిన మన్నెం నిమ్ని కి చెందిన 3 ఎకరాల 19 సెంట్ల పొలంలో వేసిన వరి పైరును ఆయన పరిశీలించారు. మన్నెం నిమ్ని కి ఆయన ఫోన్ చేసి పంట వివరాలను తెలుసుకున్నారు. గ్రామంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ గ్రామ సర్పంచ్ కి తెలిపారు. గ్రామంలో ఎవరు కూడా ఆరుబయట మలవిసర్జన చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. గ్రామంలో రెండు డొంకల్లో రోడ్డు ఏర్పాటు చేయాలని సర్పంచ్ జిల్లా కలెక్టర్ ను కోరగా, గ్రామంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటే, రోడ్ల నిర్మాణం చేపడతామని ఆయన వారికి తెలిపారు.ఈ కార్యక్రమంలో బాపట్ల మండల వ్యవసాయ అధికారి శారద, కంకటపాలెం సర్పంచ్ మద్దిరాల వందనం, వీఆర్ఓ సుధారాణి, వి ఏ ఏ షబీనా మరియు తదితరులు పాల్గొన్నారు.





