నేటి సాక్షి తిరుపతి ఆర్టీసీ కడప ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ పైడి చంద్రశేఖర్ ని ఆర్టీసీ బహుజన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ స్టార్ కృష్ణ కడపలోని ఈ.డి.కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి శాలువాతో సత్కరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్టార్ కృష్ణ మాట్లాడుతూ పైడి చంద్రశేఖర్ తిరుపతిలో డిప్యూటీ సిటిఎం గా పనిచేసేటప్పుడు ఎస్సీ ఎస్టీ, బహుజన ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కె. అంజప్పా, ఈ.వాసు తదితరులు పాల్గొని ఈ. డి.కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

