నేటి సాక్షి,బాపట్ల జిల్లా ప్రతినిధి ఈ నెల 9 న అద్దంకి లో జాబ్ మేళా ను యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. జిల్లా అధికారులు జిల్లా కార్యాలయంలో గురువారం జాబ్ మేళా వాల్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 09-12-2025 మంగళవారం, అద్దంకి నియోజకవర్గంలో 12 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించబడనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనికోరారు. జాబ్ మేళాలో విభిన్న రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొని ప్రయోజనం పొందాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారిణి మాధవి గారు, జిల్లా ప్లేస్‌మెంట్ అధికారి శ్రీనివాస్ బేగాల, ఏడీఎస్డీ (FAC) రవికిరణ్, డీఎంహెచ్ఓ విజయ లక్ష్మి పాల్గొన్నారు.




