నేటి సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో “శ్రీ పరాభ” నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలాజీ వరప్రసాద్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ బంధువులకు “శ్రీ పరాభ” నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తం బాలేష్, బీసీ యువజన సంఘం ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షుడు బొట్టుపల్లి ప్రశాంత్, మండల అధ్యక్షుడు సిరికొండ సాయి కృష్ణ (సిటీ కింగ్), యువజన సంఘం మండల అధ్యక్షుడు వైరాగడే రమేష్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్ల ఆంజనేయులు, ఎస్టీయూ సంఘం జిల్లా అధ్యక్షుడు సి.హెచ్. సంజీవ్, ఆసిఫాబాద్ సింగల్ విండో వైస్ చైర్మన్ రుకుం ప్రహ్లాద్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు షిండే నాందేవ్, నికురే హనుమంతు, ఇరుకుల్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమంలో స్థానిక ప్రజలకు ఉగాది పచ్చడి పంపిణీ చేసి నూతన సంవత్సరాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.





