నేటి సాక్షి , మహబూబాబాద్ మార్చి 11 ఉగ్గంపల్లి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన అయూబ్ పాషా గారిని ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆప్యాయంగా సన్మానించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డి . ఎస్ . రెడ్యానాయక్ నాయక్ కూడా పాల్గొని అయూబ్ పాషా గారికి అభినందనలు తెలిపారు.గ్రామ ప్రజల విశ్వాసంతో సర్పంచ్‌గా ఎన్నికైన అయూబ్ పాషా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని నేతలు సూచించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని పారదర్శకంగా పని చేస్తే గ్రామానికి మంచి పేరు తీసుకురావచ్చని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అయూబ్ పాషా గారు తమపై చూపిన విశ్వాసానికి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామ అభివృద్ధి మరియు ప్రజా సేవకే తాను కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.ఈ సన్మానం ఆప్యాయ వాతావరణంలో సాగి, నాయకుల ఆశీస్సులు అయూబ్ పాషాకు మరింత ఉత్సాహాన్ని కలిగించాయి.





