*నేటి సాక్షి-మేడిపల్లి* లయన్స్ క్లబ్ జిర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త రేకుర్తి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో భీమారం మండలం గోవిందారం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశిష్ట స్పందన వచ్చిందని లయన్స్ క్లబ్ అధ్యక్షులు అడ్డగట్ట శంకర్, జిర్డ్స్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ లైన్స్ క్లబ్ సభ్యులు అంగడి ఆనంద్ కుమార్ తెలిపారు, స్థానిక సర్పంచ్ పుల్లూరు ఉమాదేవి దేవయ్య, తో కలిసి ప్రారంభించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో 85 మంది వైద్య పరీక్షలు నిర్వహించి 30 మందికి కంటి ఆపరేషన్ నిమిత్తం రేకుర్తి పంపించినట్లు నిర్వాహకులు తెలిపారు, ఈ కార్యక్రమంలో రేకుర్తి కంటి హాస్పిటల్ టెక్నీషియన్ సురేందర్ ,పసునూరు గ్రామ సర్పంచ్ గణేష్, లయన్స్ క్లబ్ కార్యదర్శి గుండేటి గంగాధర్, కోశాధికారి సామల శ్రీహరి, డి దేవదాస్, ఉప సర్పంచ్ స్వామి, మాజీ జెడ్పిటిసి సభ్యులు నెల్లుట్ల ప్రభాకర్, స్థానిక నాయకులు నరహరి, ఎన్ఆర్ఐ కిరణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





