*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )గొల్లపల్లి మండలం బి బి రాజు పల్లెలో పశుసంవర్ధక శాఖ పశు గణన అభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ తిరుపతి.వెటరినరీ డాక్టర్స్ డాక్టర్ రవీందర్, డాక్టర్ అశోక్ పశువులకు గర్భ కోశ చికిత్స చేసి రైతులకు మందులు అందించినారు వారు మాట్లాడుతూ పాడి రైతులు పశు సంతతి పెంచుకోవడం కోసం పశువులకు గర్బకోశ చికిత్స చేయించుకోవాలి ఎదకు రాని పశువులకు తగిన మందులు వాడుకోవాలి అన్నారు పశు గణన అభివృద్ధి సంస్థ జిల్లా సూపర్వైజర్ నరసయ్య మాట్లాడుతూ శీతాకాలంలో పశువులు ఏదకు వస్తాయి గనుక పశువైద్యశిబ్బందిచే, గోపాల మిత్రులచే కృత్రిమ గర్భాదారణ చేయించుకుంటే మేలు జాతి రకపు దూడలు జన్మిస్తాయి, జన్మించిన దూడలకు 15 రోజుల నుండి నట్టల నివారణ మందును త్రాగించడం వలన దూడలు ఆరోగ్యంగా ఉంటాయి ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంధ్యారాణి వార్డు సభ్యులు పశు వైద్య సిబ్బంది రాజశ్రీ నిశాంత్ నరసయ్య, గోపాల మిత్రులు శ్రీకాంత్ రవీందర్ పాల్గొన్నారు

