*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )గొల్లపల్లి మండలం గంగాదేవిపల్లి లో పశుసంవర్ధక శాఖ పశు గణన అభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ కొలకానీ జలందర్ ఉపసర్పంచ్ ఒరగంటి మని సాయి రాం వెటరినరీ డాక్టర్స్ డాక్టర్ కాసారపు తిరుపతి గౌడ్ డాక్టర్ రవీందర్ డాక్టర్ అశోక్ గర్భ కోశ వ్యాధులకు చికిత్స చేసి రైతులకు మందులు అందించినారు వారు మాట్లాడుతూ పాడి రైతులు పశు సంతతి పెంచుకోవడం కోసం పశువులకు గర్బకోశ చికిత్స చేయించుకోవాలి ఎదకు రాని పశువులకు తగిన మందులు వాడుకోవాలి.వెటరినరీ డాక్టర్ తిరుపతి గౌడ్ మాట్లాడుతూ శీతాకాలంలో పశువులు ఏదకు వస్తాయి గనుక పశువైద్యశిబ్బందిచే, గోపాల మిత్రులచే కృత్రిమ గర్భాదారణ చేయించుకుంటే మేలు జాతి రకపు దూడలు జన్మిస్తాయి, జన్మించిన దూడలకు 15 రోజుల నుండి నట్టల నివారణ మందును త్రాగించడం వలన దూడలు ఆరోగ్యంగా ఉంటాయి అని అన్నారు పశు వైద్య సిబ్బంది నిశాంత్ నరసయ్య, గోపాల మిత్రులు శ్రీకాంత్ రవీందర్ పాల్గొన్నారు.





