(నేటి సాక్షి) నవంబర్ 25:ఉచిత ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చైతన్య రూరల్ డెవలప్మెంట్ సామాజిక సేవ సొసైటీ సంస్థ ప్రసిడెంట్ కొల్లి శ్యామ్ బాబు అన్నారు.అ సంస్థఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని ఎర్రబోడ గ్రామములో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరాన్ని తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరై ప్రారంబించారు. అంతర్జాతీయ మోటివేషనల్ స్పీకర్ సామ్ గుంటి పాల్గొని శిభిరానికి హాజరైన గ్రామ ప్రజలను ఉద్దేశించి ఆరోగ్యపరమైన పలు సలహాలు సూచనలు,ఇచ్చారు.తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అన్నారు. హైదర్గూడ, ఉప్పరపల్లి, అత్తాపూర్ గ్రామాల ప్రజలు సుమారు 380 మంది వైద్య సేవలను వినియోగించుకున్నారు.వీరిలో 197 మందికి కంటి అద్దాలు ఉచితంగా అందించగా,180 మందికి ఉచితంగా రక్తపరీక్షలు నిర్వహించడమే కాకుండా మందులను కూడ ఉచితంగా అందించడం జరిగింది.ఈ క్యాంప్ కు హాజరైన గ్రామ ప్రజలకు తమ సంస్థ ద్వారా ఈసీజీ సేవలను కూడ ఉచితంగానే అందుబాటులోకి తీసుకుని వచ్చామని సంస్థ ప్రసిడెంట్ కొల్లి శ్యామ్ బాబు తెలిపారు.డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి,సీనియర్ నాయకులు రగడంపల్లి శ్రవణ్, విజయ్ పాల్ రెడ్డి, మలాకి,కోరని దయానంద్,భరత్ రెడ్డి,తదితరులు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.




