నేటి సాక్షి, ఎండపల్లి:* ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సన్‌రైస్ హాస్పిటల్స్ కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మండలంలోని చర్లపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో నిపుణ వైద్యులు డా.రమణి బృందం పాల్గొని గ్రామస్తులకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, మధుమేహం, హీమోగ్లోబిన్ తదితర ప్రాథమిక పరీక్షలతో పాటు సాధారణ వైద్య సేవలు అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు ఇతర అత్యవసర సమస్యలకు ఆరోగ్య శ్రీ సేవలు కూడా హాస్పిటల్ లో అందుబాటులో ఉన్నాయని వైద్యులు సూచనలు ఇచ్చారు. మహిళలు, వృద్ధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య సేవలు అందుబాటులో రావడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది. ఈ సందర్భంగా సర్పంచ్ పడిదం లావణ్య- మొగిలి మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆరోగ్యమే పంచాయతీ ప్రధాన ధ్యేయమని, సన్‌రైస్ హాస్పిటల్స్ సేవా దృక్పథంతో ముందుకు వచ్చి శిబిరం నిర్వహించడంతో ప్రజల్లో ఆరోగ్య చైతన్యం మరింత పెరిగిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరిన్ని ఆరోగ్య శిబిరాలు నిర్వహించేందుకు పూర్తి సహకారం అందిస్తామని ఆమె తెలిపారు. శిబిరం విజయవంతం కావడానికి కృషి చేసిన వైద్య బృందం కో ఆర్డినేటర్ రాజేందర్, సతీష్, మార్కెటింగ్ ఇంచార్జీ బాలు హాస్పిటల్ యాజమాన్యం, పి.ఎం.పి కొత్త అనంత చారి లకు సర్పంచ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్, ఉప సర్పంచ్ అల్గం తిరుపతి, కార్యదర్శి తిరుపతి రెడ్డి, వార్డు సభ్యులు జెల్ల శ్రీనివాస్, సిగిరి శ్రేవిన్, మెరుగు రాజమ్మ నాయకులు శ్రీనివాస్, గంగాధర్, మహేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

