Friday, March 6, 2026

ఉత్కంఠకు తెర.. మున్సిపల్ పై ఎగిరిన గులాబీ జెండా

నేటి సాక్షి – రాయికల్ ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : రాయికల్ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంట కు సోమవారం తెర పడింది. రాయికల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ మరియు ఇండిపెండెంట్ కౌన్సిలర్ల మద్దతు తో బి ఆర్ ఎస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. ఇందు లో చైర్ పర్సన్ కట్కం రవీందర్ మరియు వైస్ చైర్ పర్సన్ గా తురగ సౌజన్య – శ్రీధర్ లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా *చైర్ పర్సన్ రవీందర్ మాట్లాడుతూ*.. నాపై నమ్మకం ఉంచి నన్ను చైర్ పర్సన్ చేసినందుకు మన రాయికల్ ను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ప్రత్యేక మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని. నేను సేవ చేయడానికి రాజకీయంలోకి వచ్చాను కానీ ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని అన్నారు. అందరి సహాయ సహకారాలు నాకు ఎల్లవేళలా ఉండాలని కోరాడు. ఐదు సంవత్సరాలు రాయికల్ ను అభివృద్ధి పథంలో నడిపించడానికి నా శక్తి ఉన్నంతవరకు కృషి చేస్తానని తెలిపారు. *వైస్ చైర్మన్ తురగ సౌజన్య మాట్లాడుతూ* 12 కౌన్సిలర్లలో నేను నాలుగో వార్డ్ కౌన్సిలర్ అని అందులో నాకు 702 ఓట్లు వచ్చాయని నాకు భారీ మెజారిటీ వచ్చిందని నా భర్త అయిన తురగ శ్రీధర్ గత ఐదు సంవత్సరాలు నా వార్డు ప్రజలకు చేసిన సేవ మరియు వార్డు అభివృద్ధియే ఈ మెజారిటీకి కారణమని అన్నారు. మాపై నమ్మకం ఉంచి వైస్ చైర్ పర్సన్ గా నియమించినందుకు చైర్మన్ మరియు కౌన్సిలర్లతో కలిసి రాయికల్ మున్సిపాలిటీని అభివృద్ధి లో నడిపించడంలో నా వంతు కృషి చేస్తానని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News