నేటి సాక్షి : కేటి దొడ్డి , (కొండాపురం) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండాపూర్ లో, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇస్మాయిల్, స్కూల్ ఇన్చార్జ్ శంకర్, గ్రామ యువకులు, గాజుల కృష్ణ రెడ్డి, ఆధ్వర్యంలో అందెశ్రీ గారి మరణం పట్ల మౌనం పాటించి సంతాపం తెలిపారుఈ సందర్భంగా గాజుల కృష్ణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో, కవి, గాయకుడు,తన పాటలతో, సాహిత్యంతో, కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరనిలోటు అని గాజుల కృష్ణ రెడ్డి అన్నారు.ఉద్యమ కాలంలో అందెశ్రీ తో తెలంగాణకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.దివంగత అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కొండాపురం గ్రామ విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువకులు, ప్రార్థించారు.





