నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*చిన్నగొట్టిగల్లు:*మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గం సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతోందని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని చిన్నగొట్టిగల్లు మండల పార్టీ అధ్యక్షుడు సింహాల మోహన పేర్కొన్నారు. మంగళవారం మండలం లోని రంగన్నగారిగడ్డ సచివాలయం పరిధిలో సంతకాల సేకరణ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యానికి మించి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగుతుంది. గ్రామాలు, వార్డుల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజల మద్దతు కూడగడుతున్నారు.అధినేత పిలుపు..కదం తొక్కుతున్న కార్యకర్తలువైద్య విద్యను అభ్యసించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలనుకుంటున్న పేద విద్యార్థుల స్వప్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాధి చేస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు న్నారు .వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూపొందించిన ఉద్యమాలకు ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ఇప్పటికే చలో మెడికల్ కాలేజీ ఉద్యమాన్ని నిర్వహించగా, దీనికి కొనసాగింపుగా మండలం లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుంది. గ్రామగ్రామాన, పట్టణాల్లోని డివిజన్లలోను కొద్ది రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ సంతకాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా కోటి సంతకాల సేకరణను ఉద్యమ స్ఫూర్తితో నిర్వహిస్తున్నారు, దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిశోర్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ నిర్మల, మండల వైఎస్సార్ సీపీ నాయకుడు వెంకటాచలపతి, చేనేత సంఘం అధ్యక్షుడు సుబ్రమణ్యం, పార్టీ నాయకులు మహేశ్వర రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు

