నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )……………………………………. ఉద్యోగులకు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభత్వం ప్రకటించిన ఆరోగ్య భీమా పథకాల పట్ల ఉద్యోగులు హర్షం ప్రకటించారని నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు క్యారంగుల అరుణ తెలిపారు.గురువారం నాల్గవ తరగతి ఉద్యోగుల జిల్లా కార్యవర్గ సమావేశం సంఘం కార్యాలయంలో అరుణ అధ్యక్షతన జరుగగా పలు తీర్మాణాలు చేశారు.భవిష్యత్తు కార్యాచరణ, సంఘం పటిష్టత, సభ్యుల ఐక్యత, ఉద్యోగుల ప్రయోజనం కోసం ప్రభుత్వం ప్రకటించిన స్కిముల పట్ల సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలుతెలుపుతూ సమావేశం తీర్మానం చేసిందని అరుణ తెలిపారు.సమావేశంలో కార్యదర్శి నారాయణ, కోశాధికారి సతీష్, భాగ్య, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.




