నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)………………………………….తెలంగాణా లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా పాటుపడుతానని తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు.మంగళవారం జగిత్యాల జిల్లా తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను జగిత్యాల జిల్లా తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు క్యారంగుల అరుణతో కలిసి తెలంగాణ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జగదీశ్వర్ మాట్లాడుతూ ముఖ్యంగా నాల్గవ తరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్నా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, అందరి సహకారంతో పరిష్కరిస్తానని చెప్పారు.కార్యక్రమం లో రాష్ట్ర జేఏసీ ప్రధాన కార్యదర్శి టీజీవో అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు,జగిత్యాల జిల్లా జేఏసీ చైర్మన్ టీఎన్జీవోస్ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి ,టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి అమరేందర్ రెడ్డి,జిల్లా కార్యదరినారాయణ,సతీష్ కుమార్, శ్రీను,సృజన, రాజేశం,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

