నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం*గ్రామీణ ఉపాధి హామీ పనులను ఛత్తీస్ గడ్, ఈజియస్ టీం మంగళవారం మండలంలోని మిట్ట కండ్రిగ గ్రామపంచాయతీ లోని ఉపాధి హామీల్లో భాగంగా ఫారం పాండు చంద్రశేఖర్ పొలం పరిశీలించారు అనంతరం మునిరత్నం నాయుడు పొలంలో నాటిన మామిడి చెట్లను,ఖండిత కందకాల పనిని తర్వాత బారతమిట్ట దగ్గర పశువుల నీటి తొట్టి పరిశీలించారు అదేవిధంగా కుప్పం బాదూరు గ్రామపంచాయతీలో మ్యాజిక్ డ్రైన్ ను చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు గంగిరెడ్డిపల్లె గ్రామపంచాయతీలో గ్రామ సచివాలయం విలేజ్ క్లినిక్, రైతు భరోసా భవనాలను పరిశీలించడం జరిగింది కమ్మ కండ్రిగ గ్రామపంచాయతీ కన్వర్జేన్స్ కింద సిసి రోడ్డును పరిశీలించారు ఇందులో భాగంగా గౌరవ పధక సంచాలకులు సి.వి శ్రీనివాసప్రసాద్,చంద్రగిరి ఏపిడి రెడ్డెప్ప, జి.ఐ.యస్ గుణశేఖర్,యంపిడిఓ బి పులిరాంసింగ్ ఎపిఓ చంద్రశేఖర్రాజు, ఈసి భాగ్యలక్ష్మి,టిఎ ఆరొగ్య,గోపి పాల్గొన్నారు.





