సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రమేష్ బాబు
జూపాడుబంగ్లా సెప్టెంబర్ 13 నేటి సాక్షి:–
.. 2017 సంవత్సరంలో జైన్ పరిశ్రమను ప్రారంభించి 75% స్థానిక నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని సాక్షాత్తు పరిశ్రమ ప్రారంభంలో ఆనాటి ముఖ్యమంత్రి నేటి సీఎం చంద్రబాబునాయుడు గారు హామీ ఇచ్చారని ఆ హామీని అమలు చేయకుండా ఉపాధి కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని, తక్షణమే జైన్ పరిశ్రమ ప్రారంభించి ఉద్యోగాలు కల్పించాలని లేనిపక్షంలో జైన్ పరిశ్రమ ముట్టడిస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రమేష్ బాబు హెచ్చరించారు.శనివారం స్థానిక తంగేడంచ గ్రామ శాఖ నాయకుల తో కలిసి వారు మాట్లాడారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూపాడు బంగ్లా మండలం తో పాటు నందికొట్కూరు నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పించడానికి తంగేడంచ ఫారం కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను తక్కువ ధరకు జైన్ పరిశ్రమ కు కేటాయించి ప్రారంభించారని,75% స్థానిక యువకులకు ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చారని అయితే ఏడు సంవత్సరాలు గడిచిన ఆ హామీ అమలు కాలేదని గతంలో వైసిపి ప్రభుత్వం ఈ పరిశ్రమ పట్ల పట్టించుకోలేదని గత ప్రభుత్వ తప్పిదాలను ఈ ప్రభుత్వం చేయకూడదని, ప్రతి పక్షం లో ఉండగా సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు యువగలం లో మంత్రి నారా లోకేష్ గారు జైన్ పరిశ్రమను పరిశీలించి తక్షణమే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఎలాంటి స్పందన లేదని కాలయాపన చేస్తున్నారని కోట్ల రూపాయల విలువైన 1600ఎకరాల ప్రభుత్వ భూములను విచ్చిన్నం చేసి జైన్ పరిశ్రమకు, ఏపీఐఐసి, మెగాసిడ్ పార్కుకు కేటాయించారని అభివృద్ధి కావాల్సిన భూములు అడవిని తలపిస్తూ ఉన్నాయని ఈ ప్రాంత నిరుద్యోగుల పాలిట శాపంగా మారారన్నారు.. ఈ భూములను నమ్ముకుని దాదాపు పది గ్రామాల ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ఎన్ఎస్సీ తరహాలో అభివృద్ధి చేయాలన్నారు. జైన్ పరిశ్రమలో పట్టుమని పదిమందికి కూడా ఉపాధి కల్పించలేని పరిస్థితి ఉందని,ఎపి ఐ ఐ సీ భూములను ప్రజలకు సమాచారం ఇవ్వని కెమికల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చి భూములను ధారధాతం చేస్తున్నారని వారు విమర్శించారు. మండల సమగ్ర అభివృద్ధికి జైన్ పరిశ్రమ ప్రారంభించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకై రాబోయే మాసంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు..ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు సలీం నాగరాజు వలి చెంచన్న రాజు తదితరులు పాల్గొన్నారు.

