నేటి సాక్షి 09 ఫిబ్రవరి జూపాడుబంగ్లా :— కేంద్రంలో అధికారం లోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత నీరు పేదలకు ఉపయోగపడే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర పడిందని,అందులో భాగంగానే మహాత్మా గాంధీ పేరు మార్చి కొత్తగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ జి రామ్ జి బిల్లును రద్దు చేయాలని లేనిపక్షంలో ఆందోళన తప్పదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రమేష్ బాబు హెచ్చరించారు. సోమవారం పీజీఆర్ఏస్ లో తహసీల్దార్ చంద్ర శేఖర్ నాయక్ కు సీపీఐ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాల కమ్యూనిస్ట్ ల పోరాటల ఫలితంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని, తిండైనా పెట్టండి,పనైనా చూపండి జైలుకైనా పంపండి అనే నినాదంతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తే సాధించిన అతి పెద్ద పథకం ఉపాధిహామీ పథకం అన్నారు.అలాంటి పథకాన్ని పాత పద్ధతిలో కొనసాగించాలని కొత్తగా ప్రవేశపెట్టిన జీ రాంజీ బిల్లు వల్ల ఉపాధి హామీ కూలీలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఉపాధి హామీ కూలీలకు 250 వందల రోజులు పని దినాలు కల్పించి వేతనం 600 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.ఈనెల 11 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో జి రాంజీ బిల్లు రద్దు కొరకు తీర్మానం చేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపాలన్నారు. దేశంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పేదల పట్ల కక్ష్య పూరితంగా వ్యవహరిస్తూ ఉపాధి హామీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహయ కార్యదర్శి మాగబుల్ బాషా, తిరుపతయ్య, రాజు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.





