నేటి సాక్షి 20 పాములపాడు :—మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి వికసిత్ జి రామ్ జి పేరు పెట్టడం దుర్మార్గమైన చర్య అని సిపిఎం పార్టీ ప్రజాసంఘాల నాయకులు అన్నారు . పాములపాడు మండల కేంద్రమైన స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర కళ్ళకు నల్లని గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమం మేకల రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో ఇప్పటివరకు 18 లక్షల జాబ్ కార్డులను తొలగించారని వారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఉపాధి కూలీలకు ఉపాధి పని దినాలు పెంచాలన్నారు ఎన్ఆర్ఈజీఎస్ నిధులలో ఉపాధి కూలీలకు కనీసం 20 శాతం కూడా అందడం లేదన్నారు పేరు మార్చినంత మాత్రాన ఉపాధి కూలీలకు ఏం ప్రయోజనం చేకూరుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా మార్చిన పేరు తిరిగి అలాగనే కొనసాగించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి డి స్వామన్న నాయకులు టి వెంకటేశ్వరరావు ఎస్ బాలయ్య ప్రజాసంఘాల నాయకులు కలబండి అంకన్న షేక్షావలి ఎస్ ముర్తుజావలి సాయికృష్ణ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు సిఐటియు హమాలి నాయకులు పాల్గొన్నారు





