Saturday, March 7, 2026

ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి…. మంది పల్లి గ్రామ సర్పంచ్ సురేందర్ రెడ్డి….

నేటి సాక్షి నారాయణపేట, ఫిబ్రవరి 5, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలంలోని మంది పల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను సర్పంచ్ సురేందర్ రెడ్డి గురువారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, కూలీల హాజరు , పని నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. గ్రామ అభివృద్ధికి ఉపాధి హామీ పథకం ఎంతో కీలకమని అన్నారు. మంది పల్లి గ్రామస్తులు జాతీయ ఉపాధి హామీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మంది పల్లి గ్రామ ఉప సర్పంచ్ నరేష్ కుమార్, కార్యదర్శి జ్యోతి, ఫీల్డ్ అసిస్టెంట్ అరుణ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News