ఆర్.యు.పి.పి రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్
నేటిసాక్షి, రాయికల్ :
ప్యానల్ గ్రేడ్ ప్రధానోపాధ్యాయులకు జీరో సర్వీసు తో కూడిన బదిలీలు, తదనంతరం పదోన్నతులు చేపట్టాలనే ఉద్దేశంతో విద్యాశాఖ ప్రతిపాదనలు తయారు చేసి ముఖ్యమంత్రి అనుమతి కోసం సి.ఎం.వో కార్యాలయం కు పంపినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు కూడా జీరో సర్వీసు తో కూడిన బదిలీలు చేపట్టాలని ఆర్యుపిపిటి రాష్ట్రశాఖ ఉపాధ్యక్షులు వేలుపల స్వామియాదవ్ సిఎం ను కోరారు. ఈ మేరకు స్కూల్ అసిస్టెంట్స్ పదోన్నతులు, మిగులు భాషా పండితులకు, ఎస్.జి.టి లకు ప్రమోషన్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన కోరుతూ వినతి పత్రం పంపినట్లు రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్ తెలిపారు. కేవలం పి.జి హెచ్.ఎం లకు మాత్రమే జీరో సర్వీసు తో బదిలీలు, పదోన్నతులు చేపట్టడం ద్వారా క్రింది స్థాయిలో ఖాళీలు ఏర్పడడంతో విద్యాప్రమాణాలు కుంటు బడే ప్రమాదం ఉందని. అలాగే విద్యాబోధన లో, ఫలితాలలో తీవ్ర ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కుంటు బడే విద్య ప్రమాణాలను, ఆటంకాలను అధిగమించడంలో భాగంగా పి.జి.హెచ్.ఎం లతో పాటు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులందరికి కూడా జీరో సర్వీసు తో కూడిన బదిలీలు పదోన్నతులు చేపట్టి అందరికి సమ న్యాయం చేయాలని కోరినట్లు చెప్పారు, ఇట్టి వినతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖకు కూడా పంపినట్లు ఆర్. యు.పి.పి రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్ తెలిపారు.
ఫోటో రైటప్: 24RKL03: వేల్పుల స్వామియాదవ్

