నేటి సాక్షి, బెజ్జంకి: ఉపాధ్యాయ వృత్తి వెలకట్టలేనిదని ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి అన్నారు. మండలంలోని దాచారం గ్రామంలో వ్యాయామ ఉపాధ్యాయుడు బండారుపల్లి శ్రీనివాసులు పదవి విరమణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులందరిదని కొనియాడారు. పాఠశాలకు రెండు కంప్యూటర్లు, ఆర్వో వాటర్ ఫీల్టర్ ను అందజేస్తానన్నారు. రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ దంపతులను ఘనంగా సన్మానించారు.అనంతరం రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీనివాసులు
మాట్లాడుతూ పదవి విరమణ అనేది ఉద్యోగానికి తప్పనిసరి అని ఇన్ని సంవత్సరాలు విద్యార్థులలో మమేకమై ఉన్న అనుభవాలను గుర్తు వేసుకుంటూ ఈ స్కూలుకు ఒక జిరాక్స్ మిషన్ అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఎన్ ఓ మహాతిలక్ష్మి, హెచ్ఎంలు శ్రీరాములు కృష్ణకుమారి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.