నేటి సాక్షి ఉప్పల్ నవంబర్ 7భారతదేశ స్వాతంత్య్ర సమరంలో జాతిని జాగృతం చేసిన ‘వందేమాతరం’ గీతానికి నేటితో 150 ఏళ్లు నిండాయి. ఈ వేడుక సందర్భంగా ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు, అధ్యాపకులు సామూహికంగా వందేమాతర గీతాన్ని ఆలపించారు. జాతీయోద్యమ మహనీయులకు ఘన నివాళులర్పించారు. వందేమాతరం. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా.కె.విజయ్ కుమార్ మాట్లాడుతూ జాతీయ గీతం స్ఫూర్తిగా, సమైక్యతా భావంతో దేశ అభివృద్ధికి పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.ఎ.రవి ప్రసాద్, ఎన్ఎస్ఎస్ పిఓ విశ్వనాథ్ కుమార్, డా.ఎన్ రాజశ్రీ, డా.జి.తిరుపతయ్య, కె.గీత, డా.ఎస్ యమునారాణి, పి.విజయ్ కుమార్, డా.వి.శ్రీనివాసరావు, డా.ఆర్.చంద్రసాగర్, డా.పి.వెంకటేశ్వర్లు, స్రవంతి, అనూష, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.





