జర్నలిస్టు మాదిరాజు సురేష్ సేవలను కొనియాడిన నాయకులు.జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కృషి చేయాలి ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ జర్నలిస్టుల సేవలు మరువలేనివి : ఎన్ వి ఎస్ ఎస్ జర్నలిస్టుకు అండగా ఉంటా : రాగిడి లక్ష్మారెడ్డినేటి సాక్షి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బ్యూరో జూన్ 18ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన జర్నలిస్టు మాదిరాజు సురేష్ సంస్మరణ సభకు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు హాజరయ్యారు. బుధవారం ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కేకేఆర్ గార్డెన్ లో నిర్వహించిన సంస్మరణ సభకు ప్రముఖులు హాజరై జర్నలిస్టుగా మాదిరాజు సురేష్ చేసిన సేవలను కొనియాడారు. ఉప్పల్ ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాదిరాజుసురేష్ చేసిన సేవలను అభినందించారు. నాయకులు మాట్లాడుతూ మాదిరాజు సురేష్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండే జర్నలిస్టు మాదిరాజు సురేష్ మృతిని ఎవరు జీర్ణించుకోలేక పోతున్నారని , ఉప్పల్ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి మాదిరాజు సురేష్ చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వము కృషి చేయాలని ఆయన సూచించారు. మాదిరాజు సురేష్ కుటుంబానికి తనవంతుగా ప్రభుత్వంలోని పెద్దలతో చర్చించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానన్నారు. మాదిరాజు సురేష్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్ట్ మాదిరాజు సురేష్ ఎంతో చురుకుగా ఉండేవాడని కొనియాడారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ నిర్మాణంలో తాను ఎంతో సహకరించాలని, అదేవిధంగా ప్రెస్ క్లబ్ అభివృద్ధికి మాదిరాజు సురేష్ కూడా ఎంతో చొరవ చూపే వారని గుర్తు చేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు బిఆర్ఎస్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడుతూనే దుర్భరమైన ఆర్థిక పరిస్థితుల్లో తమ జీవనాన్ని నెట్టుకు రావడం బాధ కలిగిస్తుందన్నారు. జర్నలిస్టులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని యావత్ సమాజం కూడా అండగా నిలవాలని కోరారు. జర్నలిస్టు మాదిరాజు సురేష్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఉప్పల్ మాజీ మున్సిపల్ చైర్మన్ మేకల శివారెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ జర్నలిస్టులు నిస్వార్ధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడతారని పేర్కొన్నారు. అంతకుముందు టిఆర్ఎస్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సాయి జన్ శేఖర్, గంధం నాగేశ్వరరావు లు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు నాయకులకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని అభినందించారు. జర్నలిస్టులకు అండగా ఉండాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని వారు గుర్తు చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు సురేష్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని, ఆర్థికంగా ఆదుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ సంస్మరణ సభలో పాల్గొన్న వారిలో ఉప్పల్ గ్రామ ప్రముఖుడు బండి నరసింహారెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సాయి జన్ శేకర్, మేకల మధుసూదన్ రెడ్డి, గుడి మధుసూదన్ రెడ్డి, లేతాకుల రఘుపతి రెడ్డి, అన్య బాలకృష్ణ, ఏ. మోహన్ రెడ్డి, పిల్లి నాగరాజు, కొండల్ రెడ్డి, పల్లె నర్సింగరావు, పిట్టల నరేష్, ఈరెల్లి రవీందర్ రెడ్డి, కే జగన్, సుఖ కిరణ్ , నిరంజన్ , పంగ మహేందర్ రెడ్డి, తెలంగాణ సంపత్, సుధాకర్ శెట్టి, చర్ల సుధాకర్ రెడ్డి, సిపిఎం నాయకులు ఎర్రం శ్రీనివాస్, వినోద, ఊర్మిళ వైసిపి నాయకురాలు కల్పన గాయత్రి లు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ సమావేశంలో ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు, ఉప్పల్ తహసిల్దార్ వాణిరెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ సునీల్, ఇతర మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు జర్నలిస్టుల నివాళి.. మీడియా అకాడ నుంచి ఆర్థిక సహాయం : టి యు డబ్ల్యూ జే ఆకస్మికంగా మృతి చెందిన ప్రజా దర్బార్ పత్రిక రిపోర్టర్ మాదిరాజు సురేష్ జ్ఞాపకార్థం ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కేకేఆర్ గార్డెన్ లో నిర్వహించిన సంస్మరణ సభలో జర్నలిస్టులు నివాళులర్పించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి మోత వెంకటరెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజ్, కార్యదర్శి దొంతుల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ సురేష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వ మీడియా అకాడమీ నుంచి రావాల్సిన ఆర్థిక సహాయాన్ని సాధ్యమైనంత త్వరలో వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అతని కుటుంబానికి మీడియా అకాడమి నుంచి ప్రతినెల రూ 3000 పెన్షన్ అందుతుందని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం, ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని సూచించారు. జర్నలిస్టు సురేష్ సంస్మరణ సభ ను విజయవంతం చేయడంలో కృషిచేసిన ఉప్పల్ ప్రెస్ క్లబ్ సభ్యులందరినీ టీయూడబ్ల్యూజే నాయకులు అభినందించారు.

